

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనలో చిక్కుకున్న మత్స్యకారులు, వారిని రక్షించేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న SDRF సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు చేపట్టిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న NDRF, SDRF, అగ్నిమాపక సిబ్బందితో పాటు సంబంధిత అధికారులను ఆయన అభినందించారు.
చెరువు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో మత్స్యకారులు, సహాయక సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంలో NDRF, ఇతర సహాయక బృందాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రశంసించారు. సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!