
గాసిప్స్

‘టాక్సీవాలా’తో హిట్ కాంబినేషన్‌గా నిలిచిన హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మరోసారి కలసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పవర్ఫుల్ టైటిల్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రణబాలి’ అనే టైటిల్ ఖరారైంది.
ఇది విజయ్ దేవరకొండ కెరీర్లో 14వ సినిమా కావడంతో ఇప్పటివరకు VD14 అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగింది. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!