

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ప్రత్యేకమైన కెరీర్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలు చేస్తూ ఆయన క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో ఆయనకు విస్తృతమైన అభిమానగణం ఏర్పడింది.
విజయ్ దేవరకొండ నటనతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. కరోనా సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా అనేక కుటుంబాలకు సహాయం చేశారు. తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులతో దగ్గర సంబంధం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన లైనప్‌లో ‘రౌడీ జనార్థన’, ‘రణబాలి’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ తన స్టార్‌డమ్‌ను మరింత విస్తరించుకుంటూ ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
రౌడీ జనార్థన నుంచి విడుదలైన విజయ్ దేవరకొండ బర్త్‌డే పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్‌తో విజయ్ కనిపించడం పోస్టర్‌కు యాక్షన్ టచ్ ఇవ్వగా, కీర్తి సురేష్ ఆయన ఛాతీపై కాలు పెట్టిన విజువల్ ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్లో యాక్షన్‌తో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా హైలైట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. “రౌడీ జనార్థన” ఈ డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!