

భారత్, నేపాల్ మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ధామ్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు కొత్త రైలు సర్వీసును నవంబర్ 23న ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బలేంద్ర షా న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభ ప్రత్యేక రైలు అయోధ్య ధామ్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు జనక్‌పూర్ ధామ్‌కు చేరుకోనుంది.
సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్ల మీదుగా నేపాల్‌కు చేరుకుంటుంది. మంకాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామఢి, మధుబని, జయనగర్ తదితర ప్రాంతాల్లో ఈ మార్గం ఉంటుంది. శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్యను, సీతాదేవి జన్మస్థలంగా పూజించే జనక్‌పూర్‌ను అనుసంధానించే ఈ రైలు సర్వీసుతో భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలు, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!