

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి, 2027లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు బన్నీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాసిల్ జోసెఫ్‌తో మరో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వరుసగా ఇతర భాషలకు చెందిన దర్శకులతోనే ప్రాజెక్టులు ఖరారవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ 2028 వరకు బిజీగా ఉండే అవకాశముందని టాక్. దీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర దర్శకులు బన్నీతో సినిమా చేసేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టులపై అధికారిక సమాచారం వెలువడే వరకు ఇవన్నీ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలుగానే చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!