
రాజకీయాలు

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఫోక్ సాంగ్స్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా వెండితెరకు పరిచయం కానున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జమ్మికుంటలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియదర్శి, నాగదుర్గ కలిసి మాస్ స్టెప్పులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా, ‘ఇడుపు కాయితం’ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!