విదేశాల్లో శాస్త్రవేత్తగా సేవలందించిన డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల, సమాజానికి విలువైన సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో వేద టీవీ నెట్వర్క్ను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేతుల మీదుగా ఈ ఛానెల్ నెట్వర్క్ ఆవిష్కరించబడింది. వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్, వేద డివోషనల్, వేద మ్యూజిక్, వేద కిడ్స్, వేద 4 వెల్త్ అనే ఆరు విభిన్న ఛానెల్స్ ద్వారా ప్రేక్షకులకు వినూత్న కంటెంట్ అందించనున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ గేయరచయిత మామిడి హరికృష్ణ రచించిన శ్రీరాముడిపై ప్రత్యేక గీతాన్ని కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎన్. రామచంద్రరావు భారతీయ సంస్కృతి, విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను అభినందించారు. డా. శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు నమ్మకమైన సమాచారం, విలువలతో కూడిన కార్యక్రమాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. పలువురు కళాకారులు, అతిథులు వేద టీవీ భవిష్యత్ విజయాన్ని ఆకాంక్షించారు.
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!