
జనరల్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘ది వెడ్డింగ్ సాంగ్’ లిరికల్ వీడియోను విడుదల చేసింది.
ఈ పాటకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రత్యేకంగా నటుడు సూర్య స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!