26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

Writer: Chandrika 06:56 AM, 26 జులై, 2026
కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

కాలేజీలో చదువుతున్న సమయంలో కారు కొనాలనే కోరికే తనను తొలిసారి సినిమా సెట్స్‌ వరకు తీసుకెళ్లిందని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న రకుల్‌ తన సినీ ప్రయాణం ఎలా మొదలైందో వివరించింది. తన ఫొటోలు చూసిన కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు తన తండ్రిని కలిసి సినిమాలో నటించే అవకాశం ఇచ్చారని తెలిపింది. అప్పటికి సినిమాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పింది. అయితే ఆ చిత్రానికి రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పడంతో, ఆ డబ్బుతో కారు కొనుక్కొని తన స్నేహితుల్లో సొంత కారు ఉన్న తొలి అమ్మాయిగా నిలవాలనే కోరికతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. దాదాపు 40 రోజుల షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత కెమెరా ముందు ఉండటం తనకు ఎంతో ఇష్టమని అర్థమైందని రకుల్‌ చెప్పింది.

అయితే వెంటనే సినిమాల్లో కొనసాగకుండా ముందుగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఆ తర్వాత నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రకుల్‌ తెలిపింది. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో వెండితెరకు పరిచయమైన ఆమె.. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఎవరి ప్రమేయం లేకుండానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనకు తానుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. కెరీర్‌ ప్రారంభంలో చదువు కారణంగా కొన్ని పెద్ద సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్‌.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హిందీ చిత్రం ‘రామాయణ’లో శూర్పణఖ పాత్రలో కనిపించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

భారత పౌరసత్వాన్ని ఎంచుకున్న అఖిల్ అక్కినేని

భారత పౌరసత్వాన్ని ఎంచుకున్న అఖిల్ అక్కినేని

కొత్త మేకోవర్‌తో బాలయ్య, చిరంజీవి సందడి?

కొత్త మేకోవర్‌తో బాలయ్య, చిరంజీవి సందడి?

పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న రణబాలి?

పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న రణబాలి?

ట్యాగ్లు
రకుల్ ప్రీత్ సింగ్రకుల్ సినీ ప్రయాణంరైజింగ్ భారత్ సమ్మిట్రకుల్ తొలి సినిమాగిల్లీ సినిమావెంకటాద్రి ఎక్స్‌ప్రెస్రకుల్ ఇంటర్వ్యూరామాయణ సినిమాశూర్పణఖసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..
జనరల్

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..
రాజకీయాలు

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..
జనరల్

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..
జనరల్

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..
జనరల్

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు
జనరల్

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..
జనరల్

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి
జనరల్

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!