

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. భామ్రాగడ్ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన పోస్టర్లు కనిపించినట్లు సమాచారం. వాటి ద్వారా జులై 30 వరకు గడ్చిరోలి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. నీరు, అటవీ, భూమికి సంబంధించిన సమస్యలపై నిరసనగా ఈ పిలుపు ఇచ్చినట్లు సమాచారం. గతంలోనూ మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో తాజా పరిణామాలు మరోసారి భద్రతాపరమైన ఆందోళనలకు దారితీశాయి.
పోస్టర్ల సమాచారం వెలుగులోకి రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గడ్చిరోలి జిల్లాలోని సున్నిత ప్రాంతాల్లో నిఘాను పెంచడంతో పాటు భామ్రాగడ్ పరిసరాల్లో పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాయి. బంద్ పిలుపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజా పరిణామాలను అధికారులు పరిశీలిస్తూ పరిస్థితిపై నిఘా కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!