
జనరల్

ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొంటూ ఆదివారం ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. పలు భాషల్లో ఆమె ఆలపించిన పాటలు తరతరాలుగా శ్రోతలను అలరించాయని, ఆమె గాత్రం భారతీయ సంగీత సంపదకు అపారమైన దోహదం చేసిందని మోదీ పేర్కొన్నారు.
ప్రతి భావానికి తన అసమాన గాత్రంతో ప్రాణం పోసిన మహా గాయని జానకమ్మ అని ఆయన కొనియాడారు. ఆమె ఆలపించిన మధుర గీతాలు ఎప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని తెలిపారు. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు మరియు సంగీత ప్రపంచానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ‘ఓం శాంతి’ అంటూ నివాళులర్పించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!