

ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శనివారం రాత్రి భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీలో మార్పులపై ఊహాగానాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. అయోధ్య విరాళాల వివాదం, ఈ20 ఇంధన అంశం, నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష వంటి పరిణామాల మధ్య మోదీ దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కేంద్ర మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకుని, కొందరిని కొనసాగిస్తూ మిగతావారికి బదులుగా కొత్తవారిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి నేతల పదవులపై చర్చ నడుస్తోంది. అమిత్ షాను ఉప ప్రధానిగా ప్రకటించే అవకాశంపై కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో పలువురు మంత్రులు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!