

అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ, దర్శకుడిగా పరిచయమవుతున్న మైథలాజికల్ రూరల్ డ్రామా సినిమా “వానర” జనవరి 1 న న్యూ ఇయర్ సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘లబొరే లబొరే..’ విడుదలైంది. మంచి బీట్తో వివేక్ సాగర్ ఈ పాటను కంపోజ్ చేయగా, భరద్వాజ్ గాలి సందర్భానికి తగిన లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ ఎనర్జిటిక్‌గా పాడిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!