

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ జర్నలిస్టుతో జరిగిన సంభాషణలో దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంటర్వ్యూకు రావడానికి కొద్దిసేపటి ముందు కూడా స్పిరిట్లోని కొన్ని సన్నివేశాల ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. బాహుబలి 2 ఘనవిజయం తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్‌ను స్పిరిట్ మరో స్థాయికి తీసుకెళ్తుందని ఇంటర్వ్యూయర్ అభిప్రాయపడగా, సందీప్ రెడ్డి వంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రభాస్ డిసెంబర్‌లో స్పిరిట్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా 2027లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీతో పాటు ఇతర ప్రాజెక్టులపైనా ప్రభాస్ దృష్టి సారిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!