

ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత మార్టిన్ ప్రక్కత్‌తో పాటు మరో ఇద్దరిపై కొచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమాలో ఓ వ్యక్తికి చెందిన మొబైల్ నంబర్‌ను అతడి అనుమతి లేకుండా ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. కొచ్చికి చెందిన 26 ఏళ్ల అక్షయ్ ప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్నాకుళం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మార్టిన్ ప్రక్కత్‌తో పాటు సహ నిర్మాతలు సీబీ చవారా, రంజిత్ నాయర్‌లను నిందితులుగా పేర్కొన్నారు.
సినిమాలో ఓ మహిళా పాత్రకు సంబంధించిన ఫోన్ నంబర్‌గా తన మొబైల్ నంబర్‌ను చూపించారని అక్షయ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. సినిమా విడుదలైన తర్వాత తనకు పలుమార్లు అసభ్యకర సందేశాలు, బెదిరింపు కాల్స్ వచ్చాయని, దీంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఈ ఘటన తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ 2025లో విడుదలైంది. జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రక్కత్, సీబీ చవారా, రంజిత్ నాయర్ నిర్మించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!