
టెక్నాలజీ

ఉప్పెనతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లతో కెరీర్లో దెబ్బతిన్నాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, వైష్ణవ్ గత రెండేళ్లుగా స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ అనేక కథలను తిరస్కరించాడు. ఇప్పుడేమో వైష్ణవ్ తేజ్, మనమ్, 24 వంటి క్లాసిక్ చిత్రాలకు దర్శకుడు అయిన విక్రమ్ కె. కుమార్ చెప్పిన కొత్త స్క్రిప్ట్ విన్నట్లు సమాచారం.
ఈ కథపై చర్చలు జరుగుతున్నాయని, విక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసిన తర్వాత వైష్ణవ్ తేజ్‌కు మళ్లీ వినిపించనున్నారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా 2025లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!