

‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్లి’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన వడ్డే నవీన్ పదేళ్ల విరామం తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మంచి కథ కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశానని చెప్పారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబమంతా కలిసి చూడగలిగే కథ కావడంతో ఈ సినిమాను ఎంచుకున్నానన్నారు. సాధారణ కుటుంబ కథలకు భిన్నంగా కొత్తదనం కోసం ఈ ప్రాజెక్ట్‌ను తీసుకున్నానని తెలిపారు.
‘త్రిమూర్తులు’ అనే పేరు ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తుందని చెప్పారు. కథలో నిజాయతీగల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో 55 సార్లు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఎదుర్కొనే సంఘటనలే ప్రధానంగా ఉంటాయి. నిర్మాణంలో ముందస్తు సన్నాహాలు సహాయపడ్డాయని, పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదన్నారు. సరైన కథలు రాకపోవడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పిన నవీన్, ఇకపై మంచి కథలు దొరికితే వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమని, మల్టీస్టారర్, ఓటీటీ ప్రాజెక్ట్స్‌కూ ఓపెన్‌గా ఉన్నానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!