
జనరల్

న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించి కొత్త భవనం నిర్మాణ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్‌ల మధ్య భూసర్వే ఇంకా పూర్తికాలేదని, హద్దులు ఖరారు కాకముందే నిర్మాణ పనులు చేపట్టడం సరికాదని కేంద్రం సూచించింది.
కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపి, నిధులు కేటాయించి, నిర్మాణ బాధ్యతలను ఎన్‌బీసీసీకి అప్పగించినప్పటికీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇవ్వలేదు. ముందుగా సర్వే పూర్తి చేసి హద్దుల వివాదాన్ని పరిష్కరించిన తర్వాతే నిర్మాణ ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!