
సినిమాలు

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిరమ్’ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. బలరామ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌ను కె. బిందుమాధవి యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్‌పై నిర్మించగా, కె. స్క్వేర్ సినిమాస్ సమర్పిస్తోంది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన తాన్యా హోప్, తాను ఈ చిత్రంలో సాధారణ యువతిగా కనిపిస్తానని తెలిపారు. అనుకోకుండా ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్న యువతి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొని బయటపడుతుందనే అంశం తన పాత్రలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చెప్పారు. కథ ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని, ఈ చిత్ర బృందంతో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని ఆమె వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!