

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 6న విడుదల కానున్న టీజర్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతున్న వేళ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ ఓదెల, ఈ టీజర్ తగలబడుతుందంటూ వ్యాఖ్యానించడంతో సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యాఖ్యలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో టీజర్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అభిమానుల్లో మరింత పెరిగింది. సినిమా ప్రమోషన్‌కు ఈ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చినట్టుగా కనిపిస్తోంది.
భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని మరో భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా వినూత్న శైలిలో తెరకెక్కిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!