

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం సాధించిన విజయంతో ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్రంలో విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా స్పష్టత రావడం మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గతంలో తాను ఇకపై క్యామియో పాత్రలు, ప్రతినాయక పాత్రలు చేయనని ప్రకటించిన విజయ్ సేతుపతి, ఈ సినిమాలో మాత్రం నటించినట్లు వెల్లడించారు. దీంతో ఆయన నిర్ణయం వెనుక కారణం ఏంటన్న చర్చ కూడా మొదలైంది.
రజినీకాంత్‌పై ఉన్న గౌరవం కారణంగానే ఈ ఒక్క చిత్రంలో ప్రత్యేక పాత్రకు అంగీకరించానని విజయ్ సేతుపతి తెలిపారు. ఈ వ్యాఖ్యలతో సినిమాలో ఆయన పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తొలి భాగం తరహాలోనే పలువురు ప్రముఖ నటులు ఈ సీక్వెల్‌లో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. రజినీకాంత్, విజయ్ సేతుపతి కలయిక మరోసారి ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!