

థియేటర్ ఆదాయంలో 40 శాతం వాటా కావాలంటూ ఎగ్జిబిటర్లు చేసిన డిమాండ్‌పై సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిర్మాతలు మాత్రం ఈ డిమాండ్ ప్రస్తుత విధానంలో అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్న నేపథ్యంలో, సరైన సదుపాయాలు లేని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అంత పెద్ద శాతం ఇవ్వడం అన్యాయమని అంటున్నారు. మల్టీప్లెక్స్‌ల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, శుభ్రత, సౌండ్ సిస్టమ్ వంటి కారణాలతో అక్కడే షేర్ మోడల్ సమంజసమని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఎగ్జిబిటర్లు మాత్రం ముందు థియేటర్లను అప్‌గ్రేడ్ చేస్తేనే పెట్టుబడులు పెడతామని వాదిస్తున్నారు. టికెట్ ఆదాయంతో పాటు క్యాంటీన్, అడ్స్, పార్కింగ్ ఆదాయాన్ని కూడా పంచుకోవాలన్న నిర్మాతల ప్రశ్నలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఫ్లాట్ 40% మోడల్ అన్ని సినిమాలకు సరిపోదని, ఫ్లెక్సిబుల్ సిస్టమ్ కావాలని నిర్మాతలు అంటున్నారు. ఈ వివాదంతో టాలీవుడ్ థియేటర్ ఎకోసిస్టమ్‌పై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!