

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్లు, బాక్సర్లు సత్తా చాటారు. శుక్రవారం కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. బాక్సింగ్‌లో అంకుష్ పంఘల్, పర్వీన్ హుడా, రెజ్లింగ్‌లో సుజీత్ కల్కల్ పసిడి పతకాలు సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 15కు చేరగా, మొత్తం పతకాల సంఖ్య 75కు చేరింది.
బాక్సింగ్ మహిళల 65 కేజీల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన చెన్ నిన్ చెన్‌పై పర్వీన్ హుడా 3-2తో విజయం సాధించి స్వర్ణం దక్కించుకుంది. పురుషుల విభాగంలో అంకుష్ పంఘల్ 4-0తో కొరియా బాక్సర్‌పై గెలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. ఇక పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల రెజ్లింగ్ ఫైనల్లో సుజీత్ కల్కల్ 2-9తో వెనుకబడి ఉన్నప్పటికీ అద్భుతంగా పుంజుకుని తజికిస్తాన్ రెజ్లర్ అబ్దుల్‌మహ్‌జిద్ కుదీవ్‌పై 10-9తో థ్రిల్లింగ్ విజయం సాధించాడు. ప్రస్తుత ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణంగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!