

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలై భారీ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. హిందీతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆధ్యాత్మికతతో పాటు సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ఇతర భాషల్లో విడుదలైన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుండగా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో భాగంగా ‘హనుమాన్ అంశ్ 2’ రూపొందనుండగా.. సీక్వెల్ పనులు ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. రెండో భాగాన్ని కూడా సాధ్యమైనంత తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలని భావిస్తున్నట్లు నిర్మాత అనుప్రియా నాగర్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!