2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

Writer: Chandrika 07:58 PM, 2 అక్టోబర్, 2026
మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సులను అనుసంధానించే కామన్ ట్రావెల్ పాస్‌తో పాటు ‘MeeTicket’ మొబైల్ యాప్, డిజిటల్ వీక్లీ బస్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సేవలను ప్రారంభించారు. మెట్రోతో పాటు ఆర్టీసీ బస్సులను వినియోగించే ప్రయాణికులకు, ముఖ్యంగా ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఈ విధానం ఉపయోగపడేలా రూపొందించారు.

రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా నిర్ణయించారు. ఇందులో మెట్రోకు రూ.300, ఆర్టీసీకి రూ.100 చొప్పున కేటాయించారు. నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 కాగా, ఇందులో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500గా ఉంది. మొదటిసారి కార్డు తీసుకునే సమయంలో రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. కార్డును తిరిగి అప్పగించినప్పుడు ఈ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఈ పాస్‌ను ORR పరిధిలోని అర్హత కలిగిన టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సుల్లో, పుష్పక్ సేవలను మినహాయించి, అలాగే హైదరాబాద్ మెట్రోలో ఉపయోగించుకోవచ్చు.

ఇక సిటీ బస్ ప్రయాణికుల కోసం ‘MeeTicket’ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్‌లోనే బస్ టికెట్లు, డిజిటల్ పాస్‌లు కొనుగోలు చేయవచ్చు. బోర్డింగ్ పాయింట్, గమ్యస్థానం, టికెట్ రకాన్ని ఎంచుకుని ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసిన తర్వాత డైనమిక్ QR కోడ్‌తో డిజిటల్ టికెట్ పొందవచ్చు. రోజువారీ, వారపు, నెలవారీ పాస్‌లను కూడా యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. రూ.600తో డిజిటల్ వీక్లీ బస్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కామన్ పాస్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల కోసం డైలీ కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు కామన్ పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి మెట్రోలో ప్రయాణించి, అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ అందించడం ఈ కొత్త విధానం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
ట్యాగ్లు
తెలంగాణ ప్రజా రవాణాటీజీఎస్‌ఆర్టీసీహైదరాబాద్ మెట్రోమెట్రో ఆర్టీసీ కామన్ పాస్మీటికెట్ యాప్భట్టి విక్రమార్కపొన్నం ప్రభాకర్హైదరాబాద్ రవాణాడిజిటల్ బస్ టికెట్తెలంగాణ ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..
జనరల్

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
క్రీడలు

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు
జనరల్

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?