

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గతేడాది నవంబరులో మగబిడ్డ విహాన్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తండ్రిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి విక్కీ కౌశల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బిడ్డ తొలి ఏడుపు, నవ్వులు, కొత్త హావభావాలు వంటి ప్రతి చిన్న అనుభూతి తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా కొడుకుతో కత్రినా గడుపుతున్న క్షణాలను చూస్తుంటే తన జీవితం పరిపూర్ణమైనట్లు, ఎంతో సంతృప్తిగా అనిపిస్తోందని విక్కీ పేర్కొన్నారు.
తండ్రిగా మారిన తర్వాత తనలో సున్నితత్వం, బాధ్యత మరింత పెరిగాయని విక్కీ తెలిపారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించి చాలా విషయాలు నేర్చుకుంటారని, అందుకే తాను కూడా తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మార్పులు చేసుకుంటున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల ముకేశ్ అంబానీ నివాసంలో జరిగిన గణేశ్ వేడుకల్లో కత్రినా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెపై వచ్చిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ప్రసవం తర్వాత బరువు పెరగడం సహజమేనని, తల్లిని ట్రోల్ చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!