

దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మరింత పెరగనుంది. అక్టోబర్‌లో వరుసగా ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 9న ఆదర్శ కుటుంబం, హనుమాన్ అంశ్, కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలు విడుదల కానున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందగా, శ్రీ విష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తో కామెడీ అంశాలతో తెరకెక్కింది. మరోవైపు హనుమాన్ అంశ్ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలీ బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన డివోషనల్ బయోపిక్. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించగా, విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు.
అక్టోబర్ 15న జైలర్ 2, 16న రణబాలి సినిమాలు విడుదల కానున్నాయి. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా నాన్నకుట్టి కూడా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990లలో ఉత్తరాంధ్ర జానపద కళకు, బుర్రకథకు ప్రాచుర్యం తీసుకొచ్చిన కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిన గరివిడి లక్ష్మి అక్టోబర్ 17న విడుదల కానుంది. వీటితో పాటు వేల్ ట్రైలర్, చంద్రయాన్ గ్లింప్స్ ఇటీవల విడుదలయ్యాయి. ఈ వరుస సినిమాలతో దసరా సీజన్‌లో థియేటర్ల వద్ద సందడి మరింత పెరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!