

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి చిత్రాల నుంచే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బబుల్ గేమ్, మోగ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఈసారి మరింత ఆసక్తికరమైన కథతో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కోరాజా వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వీఐ ఆనంద్ అందించిన కథతో రోషన్ కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ కే కామిశెట్టి దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, అది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లో కనిపించిన అంశాలను బట్టి ఈసారి రోషన్ ఓ కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చేసిన చిత్రాలకు భిన్నంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందనే ప్రచారం సాగుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే కథ, నటీనటులు, చిత్రీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీఐ ఆనంద్ కథ కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!