

బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అభిమానులకు దీపావళి సందర్భంగా ప్రత్యేక కానుక అందించారు. తమ కుమారుడు విహాన్ పుట్టినప్పటి నుంచి అతడిని చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తొలిసారిగా తమ కుమారుడి ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 7న విహాన్ తొలి పుట్టినరోజు జరగ్గా, మరుసటి రోజే దీపావళి సందర్భంగా ఈ జంట అందమైన కుటుంబ ఫొటోను విడుదల చేసింది. తమ జీవితాల్లో ఇదే అత్యంత వెలుగుల దీపావళి అని, అందరికీ ప్రేమ, సంతోషం కలగాలని ఆకాంక్షిస్తూ కత్రినా, విక్కీ సందేశం ఇచ్చారు.
ఈ ఫొటోలో విహాన్ తెల్లటి కుర్తా, పసుపు రంగు బండీ ధరించి చిరునవ్వులు చిందిస్తున్నాడు. కత్రినా, విక్కీ కూడా సంప్రదాయ దుస్తుల్లో కుమారుడి పక్కన కూర్చుని కనిపించారు. విహాన్ ముద్దు నవ్వు అభిమానులను ఆకట్టుకుంటోంది. అతడు అచ్చం తల్లి కత్రినాలా ఉన్నాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు కుమారుడి ముఖాన్ని బహిర్గతం చేయని ఈ జంట తొలిసారిగా ఫొటోను పంచుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!