

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తిరుపతి చేరుకోగా, రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమలలో కావ్య రెడ్డితో ఆయన వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పెళ్లి రాత్రి 11:13 గంటలకు సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఈ వేడుకను చాలా సింపుల్‌గా నిర్వహిస్తూ, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. కావ్య రెడ్డి సినీ రంగానికి చెందకపోయినా, వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఈ వివాహం జరుగుతోంది.
వివాహం తర్వాత వచ్చే నెల 1 న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ఏప్రిల్ 5న వీరి నిశ్చితార్థం ఫామ్‌హౌస్‌లో చాలా ప్రైవేట్‌గా జరిగింది. తన జీవిత భాగస్వామి గురించి శ్రీనివాస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, కావ్య తన జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉందని, ఆమె చిరునవ్వును ఎప్పటికీ కాపాడుకుంటానని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!