
జనరల్

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ పోస్టు చేశారు. ‘జన నాయగన్’, ‘లియో’, ‘బీస్ట్’, ‘మాస్టర్’, ‘కత్తి’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన అనిరుధ్, విజయ్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయాణం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని, ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.
విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న అనిరుధ్, తమ సంగీత ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆయన రాజకీయ ప్రవేశం తర్వాత విడుదల కానున్న తొలి చిత్రం కాగా, ఇదే ఆయన చివరి సినిమా కూడా కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!