
జనరల్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూలై 28, మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:52 గంటల సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూసినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
పావలా శ్యామల గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటు ఉన్న కుమార్తె కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు వెండితెరపై తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించిన ఆమె, చివరి రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు సినీ వర్గాలను, అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!