
యువ కథానాయిక శ్రీలీల తాజాగా ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసినట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. వరుస సినిమాలు, రోజుకు మూడు కాల్‌షీట్లు, విదేశీ ఈవెంట్లు, షోరూమ్ ప్రారంభోత్సవాలు… ఇలా బిజీ షెడ్యూల్ మధ్య మెడికల్ వంటి కఠినమైన కోర్సును ఎలా పూర్తి చేసిందన్న ప్రశ్న నెటిజన్లలో సందేహాలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మెడికల్ కోర్సులో 75–80 శాతం అటెండెన్స్, క్లినికల్ పోస్టింగ్స్, ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. మరి ఈ అన్ని ప్రక్రియలను ఆమె ఎలా మేనేజ్ చేసిందన్నదే ప్రధాన చర్చ.
2020లో ముంబైలోని డి.వై. పాటిల్ మెడికల్ కాలేజీలో శ్రీలీల ఎంబీబీఎస్‌లో చేరినట్లు సమాచారం. కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతులు జరిగిన నేపథ్యంలో కొంత సౌలభ్యం లభించి ఉండొచ్చని కొందరు అంటున్నారు. అయితే 2020 తర్వాత ఆమె ప్రతి ఏడాది రెండు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగింది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై మధ్య ప్రయాణాలు చేస్తూ చదువు, షూటింగ్స్‌ను సమతుల్యం చేయడం ఎలా సాధ్యమైందో ఆమెే స్పష్టత ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇండియన్ సినీ పరిశ్రమలో డాక్టర్లు అయిన హీరోయిన్లు ఉన్నప్పటికీ, వారు చదువు పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. కానీ శ్రీలీల మాత్రం నటనతో పాటు చదువును పూర్తి చేయడం ప్రత్యేకతగా నిలిచింది. ఇది క్రమశిక్షణతో సాధ్యమే అంటున్నవారూ ఉన్నారు. మొత్తానికి “ఇదేం లీలా?” అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం శ్రీలీల నుంచే రావాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!