

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాజాసాబ్ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం, ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా ₹54.15 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో భారతదేశంలో ₹45 కోట్ల నెట్ కలెక్షన్, అలాగే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ₹9.15 కోట్లు ఉన్నాయి. ఇది పాండమిక్ తర్వాత ప్రబాస్ సినిమాల్లో అతి తక్కువ ఓపెనింగ్ అయినప్పటికీ, ధురంధర్ వంటి చిత్రాల తొలి రోజు వసూళ్లను మించి నిలిచింది.
అయితే, తెలంగాణలో టికెట్ ధరలపై ప్రభుత్వ జీఓ ఆలస్యం కావడం, అర్ధరాత్రి ప్రారంభమైన ప్రీమియర్ షోలు సినిమాకు ప్రతికూలంగా మారాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అర్ధరాత్రి 11:30 తర్వాత మొదలై తెల్లవారుజామున ముగిసిన షోలు ప్రేక్షకుల అనుభూతిపై ప్రభావం చూపాయని అంటున్నారు. అలాగే, పెయిడ్ ప్రీమియర్స్‌కు ₹1000 వరకు టికెట్ ధరలు నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్న స్థాయిలో హౌస్‌ఫుల్స్ రాకపోవడానికి కారణమైంది. తక్కువ ధరలు, సమయోచిత షెడ్యూలింగ్ ఉంటే తొలి రోజు వసూళ్లు మరింత బలంగా ఉండేవని విశ్లేషకులు చెబుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!