

ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విడుదలైన ఫంకీ చిత్రానికి ప్రేక్షకులు విశేష ఆదరణ చూపుతున్నందుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. విశ్వక్ సేన్ కథానాయకుడిగా, కె.వి. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ వినోదభరిత చిత్రం థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణం చేపట్టింది.
సక్సెస్ ప్రెస్ మీట్లో మాట్లాడిన చిత్ర బృందం, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేసింది. కుటుంబంతో కలిసి హాయిగా చూసే వినోదాత్మక చిత్రంగా ‘ఫంకీ’ ని రూపొందించామని దర్శకుడు తెలిపారు. రెండు గంటల పాటు నవ్వులు పంచేలా సినిమా రూపొందిందని, ప్రేక్షకుల ఆదరణతో తమ ప్రయత్నం ఫలించిందని నిర్మాతలు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా విజయంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!