

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధర్మన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు ఆసక్తికరమైన పాత్రలతో చర్చనీయాంశంగా మారిన ఈ ప్రాజెక్ట్‌లోకి ఇప్పుడు మరో ప్రముఖ నటి చేరినట్లు సమాచారం.
కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె చేతిలో ఇప్పటికే యష్ నటిస్తున్న ‘టాక్సిక్’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు రజనీకాంత్ ‘ధర్మన్’లో భాగం కావడం ఆమె కెరీర్‌కు మరింత బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా, యోగి బాబు తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. విడుదల తేదీపై ప్రకటన ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!