

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండటంతో ఆయన తదుపరి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ, అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఇదే సమయంలో మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా బాసిల్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఐకాన్’ అనే పదం ముద్రించిన క్యాప్ ఫొటోను పంచుకున్న బాసిల్, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఆర్య-2’ చిత్రంలోని ‘రింగా రింగా’ పాటను జోడించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఈ కాంబినేషన్ దాదాపు ఖాయమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘మిన్నల్ మురళి’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్, అల్లు అర్జున్ కోసం భారీ స్థాయి సోషియో-ఫాంటసీ కథను సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!