
సినిమాలు

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి ప్రధాని నరేంద్రమోదీ తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగ పోస్టు చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో మోదీని కలిసిన భరణి.. ఆ అనుభూతిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
“నేను రాముణ్ని చూడలేదు.. కృష్ణుణ్ని చూడలేదు.. ఆదిశంకరుల్ని, వివేకానందుణ్ని చూడలేదు. కానీ వాళ్లందరి అంశాలు కలిగిన మోదీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం” అంటూ తనికెళ్ల భరణి ఎమోషనల్గా రాశారు. ప్రధాని పట్ల ఆయన వ్యక్తం చేసిన అభిమానంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!