

కరుప్పు చిత్రం ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య హీరోగా, ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 14న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల షోలు రద్దయ్యాయి. దీంతో దర్శకుడు భావోద్వేగానికి గురికాగా, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో మద్దతుగా పోస్టులు చేశారు. 24 గంటల ఆలస్యానికి తర్వాత సినిమా థియేటర్లలో విడుదలైంది.
నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పోస్టు విడుదల చేసింది. ఆలస్యానికి క్షమాపణలు చెబుతూ, తమపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ఆలస్యం వల్ల అభిమానులు ఎంత నిరాశ చెందారో తమకూ అంతే బాధ కలిగిందని పేర్కొంది. గత సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పూర్తి కాకపోవడం వల్లే విడుదల వాయిదా పడినట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల కానుంది.సూర్య, కరుప్పు, వీరభద్రుడు, ఆర్ జే బాలాజీ, త్రిష, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమిళ సినిమా, తెలుగు సినిమా, మూవీ రిలీజ్, కోలీవుడ్


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!