
జనరల్

ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో జరుగుతున్న వసూళ్ల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై APFDC డైరెక్టర్, దర్శకుడు సముద్ర స్పందిస్తూ ప్రభుత్వానికి ఈ సొసైటీకి ఎలాంటి స్థలాలు కేటాయించలేదని స్పష్టం చేశారు. తనకు ఈ ఆర్థిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.
కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ పేరు వాడి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిన వెంటనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తన పేరును దుర్వినియోగం చేస్తే సహించబోనని హెచ్చరించారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర సినీ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!