
జనరల్

సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలో లింగ వివక్ష, వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ వంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు కూడా సరైన సమయం, పెట్టుబడి ఇస్తే వారిని సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మగ సూపర్ స్టార్లను నిర్మించడానికి దర్శకులు, నిర్మాతలు ఎంత శ్రమిస్తారో, అదే స్థాయిలో మహిళా నటీమణులపై కూడా శ్రద్ధ అవసరమని ఆమె అన్నారు.
అలాగే సోషల్ మీడియా నెగిటివిటీ గురించి మాట్లాడుతూ, బయట వారి అభిప్రాయాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ఈ కారణంగా తాను మెడిటేషన్, ప్రశాంతమైన ప్రదేశాల్లో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్నానని చెప్పారు. మనసులో ఉన్నదాన్ని స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితి పెరుగుతోందని సమంత ఆవేదన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!