

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే అత్యంత పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయంతో సూర్య తన భవిష్యత్ ప్రాజెక్టుల ఎంపికలో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ‘కరుప్పు’ దర్శకుడు ఆర్జే బాలాజీతో మరో సినిమా చేయాలనే ఆలోచనలో సూర్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ‘జై భీమ్’తో ప్రశంసలు అందించిన టి.జె. జ్ఞానవేల్‌తో కూడా మరో ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్న సూర్య, విజయాన్ని అందించిన దర్శకులతోనే ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!