
జనరల్

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న భారత్ భాగ్య విధాత చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోజ్ తపాడియా దర్శకత్వం వహించగా, కంగనా ఇందులో నర్సు పాత్రలో కనిపించనుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
ఈ క్రమంలో తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కంగనకు రణవీర్ సింగ్‌పై వచ్చిన వివాదం గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె, తాను కూడా గతంలో ఎన్నో నిషేధాలు, అడ్డంకులను ఎదుర్కొన్నానని తెలిపింది. జీవితంలో ఎదుగుదలతో పాటు విమర్శలు, వ్యతిరేకతలు కూడా పెరుగుతాయని పేర్కొంది. హోదా పెరిగేకొద్దీ శత్రువులు పెరగడం సహజమేనని, అలాంటి విషయాల కంటే వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలని రణవీర్‌కు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!