

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు ప్రచార కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్న చిత్రబృందం, మరోవైపు థియేటర్ హక్కుల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా తమిళనాడు, కేరళ థియేటర్ హక్కులను థింక్ స్టూడియోస్ సంస్థకు అప్పగించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థకు ఆ ప్రాంతాల్లో బలమైన పంపిణీ వ్యవస్థ ఉండటంతో సినిమాకు మంచి థియేటర్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే తమిళనాడు, కేరళ మార్కెట్లలో కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!