

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్లిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం మరో దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాబిన్‌హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోకపోవడం, ఆమె పారితోషికంపై వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్‌లో శ్రీలీలకు అవకాశాలు తగ్గాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే శ్రీలీల ఇతర భాషలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. కార్తీక్ ఆర్యన్‌తో అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. అలాగే ఇబ్రహీం అలీ ఖాన్‌తో దిలేర్ చిత్రంలోనూ భాగమైంది. తెలుగు సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి ఇతర పరిశ్రమల్లో తన మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మార్పు శ్రీలీల కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!