

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణం రాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రభాస్, చిన్న చిన్న చిత్రాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకూ ఎదుగుతూ స్వంత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఛత్రపతి నుంచి బాహుబలి వరకు చేసిన ప్రతీ హిట్ తో ఆయన మార్కెట్ కొత్త స్థాయికి చేరింది.
ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో చురుగ్గా వినిపిస్తోంది.
ఇంతలో విడుదలకు ముందే ఈ చిత్రం ఒక సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల డిజిటల్ హక్కులు కలిపి సుమారు రూ.160 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు పరిశ్రమలో చర్చ సాగుతోంది. రిలీజ్ ముందే ఇంత భారీ డీల్ జరగడం ‘స్పిరిట్’ పై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
డిజిటల్ హక్కులే ఈ స్థాయిలో పలికితే, థియేట్రికల్ రిలీజ్ సమయం లో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉండబోతుందో అంచనా వేయడం కష్టం కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ చిత్రంలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండ గా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా 2027 లో విడుదల అయ్యే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!