

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఇటీవల విడుదలైన ఆడియో స్టోరీలోనూ జైలులో ఉన్న మాజీ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్‌ను పరిచయం చేశారు.
తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం, సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ సెంట్రల్ జైలు నేపథ్యంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు అదుపు తప్పిన సమయంలో ప్రభాస్ పేరు వినగానే ఖైదీల్లో భయం మొదలవుతుందని, ఆ తర్వాత ఆయన ఎలాంటి హడావుడి లేకుండా పోలీస్ లుక్‌లో సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తాడని సమాచారం. అయితే హిందీ క్లాసికల్ పాటలు వింటూ ఆయన ఎంట్రీ ఇవ్వడం వంటి వివరాలు ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించబడలేదు. సినిమాలో త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!