

టామ్ హాలండ్, జెండాయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 500 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వారంలోనూ వసూళ్లు పెద్దగా తగ్గకపోవడం సినిమాకు ఉన్న ఆదరణను చూపిస్తోంది. 3డీ వెర్షన్‌తో కలిపి మొత్తం గ్రాస్ రూ. 520 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. రాబోయే ‘బట్వారా 1947’, ‘ఆవారాపన్ 2’ సినిమాల నుంచి పోటీ ఉన్నా హోల్డ్ కొనసాగితే మరింత వసూళ్లు సాధించే అవకాశం ఉంది.ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఫుల్ రన్‌లో రూ. 600 కోట్ల గ్రాస్, రూ. 500 కోట్ల నెట్ సాధించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1.7 కోట్ల మంది ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో 2 కోట్లకు పైగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో ‘టైటానిక్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఉన్నాయి. ఇప్పుడు ‘స్పైడర్-మ్యాన్’ కూడా అదే రికార్డు దిశగా వేగంగా దూసుకెళ్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!