

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సంభాషణ ఫలప్రదంగా సాగిందని మోదీ పేర్కొన్నారు. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితంగా కొనసాగాలని ఇద్దరూ అంగీకరించారు.
అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా మోదీ, ట్రంప్ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. మరోవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం అమెరికాలో వాణిజ్య సంబంధిత చర్చల్లో పాల్గొంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!