

ఆసియా క్రీడలను వీక్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా నిర్వహణ, మౌలిక సదుపాయాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం జపాన్‌కు బయలుదేరింది. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ఈ బృందంలో ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎస్‌ఏటీజీ వీసీ, ఎండీ ఏ. సోనిబాల దేవి ఉన్నారు.
ఆరు రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న ప్రతినిధి బృందం.. అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ, ఆధునిక క్రీడా మౌలిక వసతులు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, ఇతర సౌకర్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో క్రీడా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అంశాలను పరిశీలించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!